ప్రిక్వార్టర్స్‌లో  సాయి ఉత్తేజిత  | Sai uttejitha in the Prequelers | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో  సాయి ఉత్తేజిత 

Feb 22 2018 1:37 AM | Updated on Feb 22 2018 1:37 AM

Sai uttejitha in the Prequelers - Sakshi

సాయి ఉత్తేజిత 

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్‌ గ్రేడ్‌–5 అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు శుభారంభం చేయగా... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, జక్కా వైష్ణవి రెడ్డి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాయి ఉత్తేజిత 25–23, 21–16తో వైవోని లీ (జర్మనీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శ్రీకృష్ణప్రియ 11–21, 15–21తో లిన్నీ అలెజాండ్రా మైనకి (ఇండోనేసియా) చేతిలో... వైష్ణవి రెడ్డి 19–21, 17–21తో జూలీ జాకబ్సన్‌ (డెన్మార్క్‌) చేతి లో ఓడిపోయారు.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో గురుసాయిదత్‌ 21–16, 21–11తో మూడో సీడ్‌ వైగోర్‌ కోలో (బ్రెజిల్‌)పై, సౌరభ్‌ వర్మ 21–11, 21–18తో మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)పై, సమీర్‌ వర్మ 22–20, 21–10తో థామస్‌ రూక్సెల్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

Advertisement
 
Advertisement
Advertisement