సాయిప్రణీత్ ముందంజ | Sai praneet is at first | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్ ముందంజ

Nov 26 2014 12:49 AM | Updated on Sep 2 2017 5:06 PM

సాయిప్రణీత్ ముందంజ

సాయిప్రణీత్ ముందంజ

మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

మకావు: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్ 11-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి వూన్ కాక్ హాంగ్ (మలేసియా) గాయంతో వైదొలిగాడు. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో రొనాల్డ్ సుసిలో (సింగపూర్)తో సాయిప్రణీత్ ఆడతాడు.

భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేయగా... అజయ్ జయరామ్, అరవింద్ భట్ ఓడిపోయారు. తొలి రౌండ్‌లో సౌరభ్ వర్మ 21-14, 21-15తో యాంగ్ చి చెయి (చైనీస్ తైపీ)పై... ప్రణయ్ 21-12, 21-18తో చున్ షి కుయ్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. జయరామ్ 15-21, 11-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; అరవింద్ 15-21, 5-21తో షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement