breaking news
Macau Open Grand Prix Gold badminton tournament
-
ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
మకావు ఓపెన్ టోర్నీ మకావు: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు 21-19, 21-15తో హుంగ్ షి హాన్ (చైనీస్ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో కేరళ అమ్మాయి పి.సి.తులసి 12-21, 17-21తో సు యా చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. రెండో రౌండ్లో సాయిప్రణీత్ 21-15, 21-18తో రొనాల్డ్ సుసిలో (సింగపూర్)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21-18, 21-16తో ఆండ్రీ మార్టిన్ (ఇండోనేసియా)పై గెలిచాడు. అయితే భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ 21-17, 17-21, 20-22తో సుపన్యు అవింగ్సానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో సోనీ ద్వి కున్కురో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)తో సింధు తలపడతారు. -
సాయిప్రణీత్ ముందంజ
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్ 11-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి వూన్ కాక్ హాంగ్ (మలేసియా) గాయంతో వైదొలిగాడు. బుధవారం జరిగే రెండో రౌండ్లో రొనాల్డ్ సుసిలో (సింగపూర్)తో సాయిప్రణీత్ ఆడతాడు. భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేయగా... అజయ్ జయరామ్, అరవింద్ భట్ ఓడిపోయారు. తొలి రౌండ్లో సౌరభ్ వర్మ 21-14, 21-15తో యాంగ్ చి చెయి (చైనీస్ తైపీ)పై... ప్రణయ్ 21-12, 21-18తో చున్ షి కుయ్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. జయరామ్ 15-21, 11-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; అరవింద్ 15-21, 5-21తో షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు.