సాయి కుమార్‌కు స్వర్ణం | sai kumar gets gold medal in boxing tourny | Sakshi
Sakshi News home page

సాయి కుమార్‌కు స్వర్ణం

Nov 15 2016 11:19 AM | Updated on Sep 4 2017 8:10 PM

మూల అడవయ్య గౌడ్ స్మారక బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఎల్. సాయి కుమార్ (జీహెచ్‌ఎంసీ, సికింద్రాబాద్) సత్తా చాటాడు.

సాక్షి, హైదరాబాద్: మూల అడవయ్య గౌడ్ స్మారక బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఎల్. సాయి కుమార్ (జీహెచ్‌ఎంసీ, సికింద్రాబాద్) సత్తా చాటాడు. తెలంగాణ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో లైట్ ఫ్లై వెరుుట్ విభాగంలో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. పవన్ కుమార్ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఫ్లై విభాగంలో డొమినిక్ మైకేల్, ఎగప్పన్ (తమిళనాడు)... బాటమ్ విభాగంలో ఎస్సాకి ముత్తు, మనోజ్... లైట్ విభాగంలో పరమ్‌జీత్, ప్రిన్‌‌స సిన్హా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్స్ అందించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement