సెమీస్‌లో సాయిదేదీప్య జంట | sai dedeepya pair enter final of AITA | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య జంట

Aug 3 2017 11:15 AM | Updated on Sep 17 2017 5:07 PM

సెమీస్‌లో సాయిదేదీప్య జంట

సెమీస్‌లో సాయిదేదీప్య జంట

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన సాయిదేదీప్య–షేక్‌ హుమేరా జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది.

‘ఐటా’ మహిళల టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన సాయిదేదీప్య–షేక్‌ హుమేరా జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–హుమేరా జంట 6–2, 6–0తో అవిష్క గుప్తా (జార్ఖండ్‌)–వన్షికా పఠానియా (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ హర్షసాయి (ఏపీ)– హిమానీ మోర్‌ (హరియాణా) జంటతో తలపడుతుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement