అగ్రస్థానంలో సాహితి వర్షిణి | sahiti varshini leads in under 9 chess tourny | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో సాహితి వర్షిణి

Aug 30 2016 11:46 AM | Updated on Sep 4 2017 11:35 AM

జలంధర్‌లో జరుగుతోన్న జాతీయ స్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి సాయి వర్షిణి అగ్రస్థానంలో నిలిచింది.

జాతీయ స్థాయి చెస్ చాంపియన్‌షిప్  

సాక్షి, హైదరాబాద్: జలంధర్‌లో జరుగుతోన్న జాతీయ స్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి సాయి వర్షిణి అగ్రస్థానంలో నిలిచింది. పదో రౌండ్ ముగిసే సరికి 9 పాయింట్లతో సవితశ్రీతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన సాయి వర్షిత్ 7.5 పారుుంట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు.

సోమవారం జరిగిన పదో రౌండ్ బాలికల మ్యాచ్‌ల్లో సాహితి వర్షిణి (9, ఏపీ)... పటేల్ రిధి (7, గుజరాత్)పై, సవితశ్రీ (6.5, తమిళనాడు)... హిమ ప్రియ (6.5, తమిళనాడు)పై, సేవిత విజు (5.5, తెలంగాణ)... ప్రకృతి (5.5, ఒడిశా)పై, కీర్తి (6, తెలంగాణ)... జప్‌లీన్ కౌర్ (5, పంజాబ్)పై, మైత్రి (5.5, తెలంగాణ)... రిచా (4.5, మహారాష్ట్ర)పై, జాహ్నవి (5.5, తెలంగాణ)... నందిక సాహు (అస్సాం)పై విజయం సాధించారు. కనిష్క (6, తమిళనాడు), మనుశ్రీ (6, తెలంగాణ)ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

 బాలుర విభాగంలో దేవ్ (8.5, మహారాష్ట్ర)... సాయి వర్షిత్ (7.5, తెలంగాణ)తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకోగా మిగతా మ్యాచ్‌ల్లో షాహిల్ (9, అస్సాం)... తన్మయ్ (7, పంజాబ్)పై, శ్రేయస్ (8, ఒడిశా)... ప్రణీత్(7, తెలంగాణ)పై గెలుపొందారు.
 

Advertisement
 
Advertisement
Advertisement