సచిన్.. ప్రపంచంలోనే మేటి ఆటగాడు | Sachin Tendulkar ranks among top all-time great athletes: N Srinivasan | Sakshi
Sakshi News home page

సచిన్.. ప్రపంచంలోనే మేటి ఆటగాడు

Nov 7 2013 12:43 AM | Updated on Sep 2 2017 12:20 AM

సచిన్.. ప్రపంచంలోనే మేటి ఆటగాడు

సచిన్.. ప్రపంచంలోనే మేటి ఆటగాడు

సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే మేటి క్రికెటర్ అని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అన్నారు.

సాక్షి, తిరుమల: సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే మేటి క్రికెటర్ అని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అన్నారు. బుధవారం ఆయన తిరుమలకు వచ్చారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి, దర్శనంతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు.
 
 ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ముంబైలో జరిగే సచిన్ టెండూల్కర్ చివరి టెస్టును ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుమలేశుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
 
 శ్రీవారి ఆలయం ముందు శ్రీనివాసన్
 

Advertisement
 
Advertisement
Advertisement