నేను ఆ ల్యాండ్ అడగలేదు: సచిన్ | Sachin Tendulkar denies seeking land from IIT Delhi for academy | Sakshi
Sakshi News home page

నేను ఆ ల్యాండ్ అడగలేదు: సచిన్

Dec 28 2014 2:30 PM | Updated on Sep 2 2017 6:53 PM

నేను ఆ ల్యాండ్ అడగలేదు: సచిన్

నేను ఆ ల్యాండ్ అడగలేదు: సచిన్

ఒక క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం ఐఐటీ ఢిల్లీ నుంచి తాను స్థలం అడిగినట్లు వచ్చిన వార్తలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఖండించాడు.

న్యూఢిల్లీ: ఒక క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం ఐఐటీ ఢిల్లీ నుంచి తాను స్థలం అడిగినట్లు వచ్చిన వార్తలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఖండించాడు. ప్రస్తుతం ఏ విధమైన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడం లేదన్నాడు. ' క్రికెట్ అకాడమీ కోసం ఐఐటీ ఢిల్లీ నుంచి స్థలం కోరినట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు.  నేను ఏ విధమైన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడం లేదు.  ఎవరి వద్ద నుంచి కూడా స్థలం కోరలేదు' అని సచిన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

సచిన్ క్రికెట్ అకాడమీ కోసం స్థలం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒత్తిడి తెచ్చినట్లు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రఘునాథ్ కె.షెవగోన్కర్ ఆరోపించినట్లు వార్తలు రావడంపై సచిన్ మండిపడ్డాడు. వార్తలను ప్రచురించేటప్పుడు ఒకసారి క్షుణ్ణంగా పరిక్షీంచుకోవాలని మీడియాకు సూచించాడు.  ఒకవేళ అదే నిజమైతే తన నుంచి ఎందుకు వివరణ తీసుకోలేదని సచిన్ ప్రశ్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement