రసెల్‌ వచ్చేశాడు..

Russell and Gabriel come in for West Indies - Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం రోజ్‌బౌల్‌  మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో వెస్టిండీస్‌ తలపడుతోంది. ఒకవైపు భీకరమైన ఫామ్‌తో ఉన్న ఇంగ్లండ్‌.. మరొకవైపు తమదైన రోజున ఎటువంటి ప్రత్యర్థినైనా మట్టికరిపించే వెస్టిండీస్‌. దాంతో రసవత్తర పోరు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ముందుగా విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇంగ్లండ్‌ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. విండీస్‌ పలుమార్పులు చేసింది. ఆండ్రీ రసెల్‌, ఎవిన్‌ లూయిస్‌, గాబ్రియెల్‌లు తుది జట్టులోకి వచ్చారు.

గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన విండీస్‌ స్టార్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఇంగ్లండ్‌తో పోరులో బరిలోకి దిగుతున్నాడు. గాయం నుంచి కోలుకోవడంతో రసెల్‌కు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాంతో విండీస్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మరొకవైపు విండీస్‌ బౌలింగ్‌ విభాగంలో షెనాన్‌ గాబ్రియల్‌ జట్టులోకి వచ్చాడు. ఇరు జట్లు తమ ముఖాముఖి రికార్డులో 101 మ్యాచ్‌లు ఆడగా ఇంగ్లండ్‌ 51 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, వెస్టిండీస్‌ 44 గెలిచింది. ఆరుమ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచ కప్‌లో మాత్రం ఇంగ్లండ్‌దే పూర్తిగా పైచేయి. విండీస్‌తో ఆరుసార్లు తలపడగా... ఐదుసార్లు ఇంగ్లండే నెగ్గింది. ఒక్కదాంట్లోనే కరీబియన్లు (1979 ప్రపంచ కప్‌ ఫైనల్‌) విజయం సాధించగలిగారు.

తుది జట్లు

వెస్టిండీస్‌
జేసన్‌ హోల్టర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, నికోలస్‌ పూరన్‌, హెట్‌మెయిర్‌, ఆండ్రీ రసెల్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, షెల్డాన్‌ కాట్రెల్‌​, షెనాల్‌ గాబ్రియెల్‌, ఓష్నీ థామస్‌

ఇంగ్లండ్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జోనీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top