యూరోప్ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో | Ronaldo is the best footballer in Europe | Sakshi
Sakshi News home page

యూరోప్ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో

Aug 27 2016 12:27 AM | Updated on Sep 4 2017 11:01 AM

యూరోప్ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో

యూరోప్ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో

యూరోప్ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) ఉత్తమ ఆటగాడిగా స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఎంపికయ్యాడు.

యూరోప్ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) ఉత్తమ ఆటగాడిగా స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఎంపికయ్యాడు. తాజా సీజన్‌లో చాంపియన్‌‌స లీగ్ టైటిల్ గెలుచుకున్న రియల్ మాడ్రిడ్, యూరో కప్ గెలుచున్న పోర్చుగల్ జట్లలో 31 ఏళ్ల రొనాల్డో సభ్యుడు కావడం విశేషం.

ఈ రెండు టోర్నీ విజయాల్లో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు దక్కింది. యూఈఎఫ్‌ఏలోని 55 సభ్య దేశాలకు చెందిన జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొని రొనాల్టోను అవార్డుకు ఎంపిక చేశారు. 2013-14 సీజన్‌లో కూడా అతనికి ఈ అవార్డు దక్కింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement