breaking news
Union of European Football Associations
-
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహా సంక్షోభం.. ఫిఫాకు యూఈఎఫ్ఏ షాక్
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహా సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) తీసుకున్న ఒక వివాదాస్పద ఆర్థిక నిర్ణయంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (UEFA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల కోసం 20 బిలియన్ డాల్లరతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని ఫిఫా చూస్తోంది.ఈ నేపథ్యంలో ఫిఫా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోపోతే రాబోయే వరల్డ్ కప్‌లతో సహా అన్ని పోటీలను బహిష్కరిస్తామని యూఈఎఫ్ఏకు 55 సభ్య దేశాలు ఏకగ్రీవంగా హెచ్చరించాయి.యూఈఎఫ్ఏ, అందులోని సభ్య దేశాల సంఘాలు ఏకతాటిపై నిలిచాయి. వరల్డ్ కప్, ఫిఫా నిర్వహించే ఇతర పోటీల యాజమాన్య హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు బదిలీ చేయాలనే ఫిఫా ప్రతిపాదనను మేమందరం ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాం. వరల్డ్ కప్‌ను ఒక వ్యాపార వస్తువుగా పరిగణించలేము. అది తరతరాలుగా ఆటగాళ్లు, అభిమానులు నిర్మించుకున్న గొప్ప క్రీడా వారసత్వం. ఇందులో ఏ భాగాన్ని కూడా ఎప్పుడూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించకూడదు. ప్రపంచ కప్ అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అని యూఈఎఫ్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. -
పాజిటివ్ వస్తే మ్యాచ్ రెండు రోజులు వాయిదా
జెనీవా (స్విట్జర్లాండ్): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లలోని ఏ ఆటగాడైనా కరోనా బారిన పడితే... ఆ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌ను గరిష్టంగా రెండు రోజుల పాటు వాయిదా వేసే కొత్త రూల్‌ను రూపొందించనట్లు పేర్కొంది. అంతేకాకుండా జట్టు సభ్యుల సంఖ్యను 23 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఏ జట్టయినా తన మ్యాచ్‌ను ఆడకపోతే... 0–3తో ఆ జట్టు ఓడిందని, దానికి సంబంధిచిన పూర్తి పాయింట్ల్ల (3)ను ప్రత్యర్థి జట్టుకు అందజేసేలా నిబంధనను తీసుకొచ్చారు. జూన్ 11 నుంచి జూలై 11 వరకు 31 రోజుల పాటు యూరప్‌లోని 11 నగరాల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. 24 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మ్యాచ్‌ల సందర్భంగా 25 శాతం మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. -
యూరోప్ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో
యూరోప్ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (యూఈఎఫ్ఏ) ఉత్తమ ఆటగాడిగా స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఎంపికయ్యాడు. తాజా సీజన్లో చాంపియన్స లీగ్ టైటిల్ గెలుచుకున్న రియల్ మాడ్రిడ్, యూరో కప్ గెలుచున్న పోర్చుగల్ జట్లలో 31 ఏళ్ల రొనాల్డో సభ్యుడు కావడం విశేషం. ఈ రెండు టోర్నీ విజయాల్లో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు దక్కింది. యూఈఎఫ్ఏలోని 55 సభ్య దేశాలకు చెందిన జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొని రొనాల్టోను అవార్డుకు ఎంపిక చేశారు. 2013-14 సీజన్లో కూడా అతనికి ఈ అవార్డు దక్కింది.


