వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ! | Rohit Sharma ruled out for the ongoing ODI series against England | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ!

Aug 29 2014 4:20 PM | Updated on Sep 2 2017 12:38 PM

వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ!

వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ!

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ కు భారత ఆటగాడు రోహిత్ శర్మ దూరమయ్యాడు

కార్డిఫ్: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ కు భారత ఆటగాడు రోహిత్ శర్మ దూరమయ్యాడు. రెండవ వన్డేలో హాఫ్ సెంచరీ రోహిత్ శర్మ నమోదు చేసిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా వన్డే సిరీస్ ను తప్పుకున్నాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. 
 
చేతి వేలికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.  రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్ ను జట్టులోకి తీసుకున్నారు. మూడవ వన్డే శనివారం నాటింగ్హమ్ లో జరుగనుంది. టెస్ట్ సిరీస్ లో ఘోర వైఫల్యం చెందిన భారత జట్టు వన్డే సిరీస్ లో శుభారంభాన్ని ఆందించింది. 

Advertisement
 
Advertisement
Advertisement