రోహిత్‌ ఖాతాలో మరో ఘనత | Rohit Sharma Joins Virat Kohli and Suresh Raina in elite list | Sakshi
Sakshi News home page

రోహిత్‌ ఖాతాలో మరో ఘనత

Apr 18 2019 8:57 PM | Updated on Apr 18 2019 9:07 PM

Rohit Sharma Joins Virat Kohli and Suresh Raina in elite list - Sakshi

ఢిల్లీ: భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల మార్కును చేరిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 30 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు. కాగా, టీ20 క్రికెట్‌లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందు 8వేల టీ20 పరుగుల మార్కును చేరడానికి 12 పరుగులు దూరంలో ఉన్న రోహిత్‌.. ఆ రికార్డును అందుకున్నాడు. 

ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో సురేశ్‌ రైనా(8,216) తొలి స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లి(8,183) రెండో స్థానంలో ఉన్నాడు. తాజా మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. దాంతో ముంబై బ్యాటింగ్‌ను రోహిత్‌ శర్మ-డీకాక్‌ల జోడి ఆరంభించింది. ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ మొదటి వికెట్‌గా ఔటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement