‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో బోపన్న జంట ఓటమి | Rohan Bopanna & Timea Babos lose Australian Open mixed doubles final | Sakshi
Sakshi News home page

‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో బోపన్న జంట ఓటమి

Jan 29 2018 4:18 AM | Updated on Jan 29 2018 4:18 AM

Rohan Bopanna & Timea Babos lose Australian Open mixed doubles final - Sakshi

బోపన్న–బాబోస్‌

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గాలని ఆశించిన భారత స్టార్‌ రోహన్‌ బోపన్నకు అనుకున్న ఫలితం రాలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బోపన్న–తిమియా బాబోస్‌ (హంగేరి) జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)–మాట్‌ పావిక్‌ (క్రొయేషియా) ద్వయంతో ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–బాబోస్‌ జంట 6–2, 4–6, 9–11తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఓడిపోయింది.

గతేడాది దబ్రౌస్కీతో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన బోపన్న ఈసారి ఆమెను ప్రత్యర్థిగా ఎదుర్కొన్నాడు. చెరో సెట్‌ గెలిచిన తర్వాత నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో బోపన్న జంట 9–8తో మ్యాచ్‌ పాయింట్‌ సాధించినా... ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. విజేత దబ్రౌస్కీ–పావిక్‌ జంటకు లక్షా 75 వేలు (రూ. 90 లక్షల 30 వేలు), రన్నరప్‌ బోపన్న–బాబోస్‌ జోడీకి 90 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 46 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement