సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్ | Rogers opens up on playing future | Sakshi
Sakshi News home page

సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్

Jan 5 2015 12:57 AM | Updated on Sep 2 2017 7:13 PM

సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్

సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్

వచ్చే యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ స్వదేశంలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.

సిడ్నీ: వచ్చే యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ స్వదేశంలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 6 నుంచి భారత్‌తో జరిగే సిడ్నీ టెస్టు స్వదేశీ గడ్డపై ఆఖరిదని ప్రకటించాడు. ‘భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యాషెస్ సిరీస్ అనంతరం ఆటను ముగిద్దామనుకుంటున్నాను. అయితే ఇక్కడ చివరి టెస్టును ఘనంగా ముగించాలనుకుంటున్నాను’ అని 19 టెస్టులు ఆడి 1,384 పరుగులు చేసిన 37 ఏళ్ల రోజర్స్ అన్నాడు.

ధోని గైర్హాజరీతో ఆసీస్‌కు లాభం: వార్నర్
టెస్టులకు వీడ్కోలు పలికిన ఎం.ఎస్.ధోని గైర్హాజరీ... నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని డాషింగ్ ఓపెనర్ వార్నర్ అన్నాడు. మ్యాచ్ గురించి మహి చాలా రకాలుగా ఆలోచిస్తాడని, అతను ఆటపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని ప్రశంసించాడు. ధోని స్థానంలో పగ్గాలు చేపట్టిన కోహ్లి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలన్న ఆతృత ఎక్కువైందని వార్నర్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement