breaking news
the Ashes series
-
టాయిలెట్ బ్రేక్.. కట్ చేస్తే! ఆసీస్ ఓపెనర్‌కు ఊహించని షాక్
పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్ ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. స్టార్ 7 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్(46), జేమీ స్మిత్(33) ఫర్వాలేదన్పించారు. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెగ్యూలర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బదులుగా మార్నస్ లబుషేన్ రావడాన్ని చూసి మైదానంలో ఉన్న ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు.వాస్తవానికి తొలి టెస్టుకు అరంగేట్ర ఆటగాడు జేక్ వెదరాల్డ్, ఖవాజా ఓపెనర్లుగా ఉన్నారు. కానీ ఉస్మాన్ మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడికి ఏమైనా గాయమైందా? అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. అయితే ఖావాజా బ్యాటింగ్‌కు రాకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఆఫ్‌ది ఫీల్డ్ టైమ్ పూర్తి కాకపోవడం వల్లే ఉస్మాన్ ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభించలేకపోయాడు.రూల్స్ ఏమి చెబుతున్నాయి?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఖవాజా ఎక్కువ సమయం పాటు మైదానం వెలుపల (Off the field) ఉన్నాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక ప్లేయర్ బ్రేక్ పేరిట ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సమయం మైదానం బయట ఉంటే సదరు ఆటగాడికి కొన్ని ఆంక్షలు వర్తిస్తాయి. ఎంత సమయం పాటు బయట ఉన్నాడో.. ఆ నిర్ధిష్ట సమయం పూర్తి అయ్యే వరకు బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుమతించరు. ఇప్పుడు ఖవాజా విషయంలో అదే జరిగింది. ఇంగ్లండ్ వికెట్లు వెంటవెంటనే పడడంతో ఖవాజా ఆఫ్‌ది ఫీల్డ్ సమయాన్ని పూర్తి చేయలేకపోయాడు. దీంతో అతడు తన బ్రేక్ సమయానికి అనుగుణంగా డ్రెసింగ్రూమ్లోని ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఓపెనర్‌గా కాకుండా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.అయితే టాయిలెట్ బ్రేక్స్ పేరిట అతడు దాదాపుగా 20 నిమిషాల పాటు ఆఫ్‌ది ఫీల్డ్ పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమ్యాచ్‌లో ఖవాజా తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఆసీస్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ (The Ashes) తాజా ఎడిషన్ శుక్రవారం మొదలైంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుని.. ఆతిథ్య ఆసీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆదిలోనే ఇంగ్లండ్‌కు కోలుకోలేని షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చిన క్రాలీ.. ఆరు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.ముచ్చటగా మూడుఅనంతరం ఏడో ఓవర్ నాలుగో బంతికి స్టార్క్ మరోసారి తన బౌలింగ్ పదును చూపించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇదే జోరులో తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి మరో కీలక వికెట్‌ను స్టార్క్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్‌ను స్టార్క్ డకౌట్ చేశాడు.వంద వికెట్ల క్లబ్లోతద్వారా మూడు కీలక వికెట్లు కూల్చిన స్టార్క్.. యాషెస్ సిరీస్‌లో ఓవరాల్‌గా వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆస్ట్రేలియన్‌గా... అదే విధంగా.. 21వ బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ పేసర్ చరిత్రకెక్కాడు. కేవలం 23 టెస్టుల్లోనే (యాషెస్) స్టార్క్ వంద వికెట్ల క్లబ్లో చేరడం విశేషం.అంతేకాదు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా కర్ట్లీ ఆంబ్రోస్ రికార్డును కూడా స్టార్క్ సమం చేశాడు. టెస్టుల్లో 405 వికెట్లు పూర్తి చేసుకుని.. ఆంబ్రోస్ సరసన నిలిచాడు. తద్వారా వసీం అక్రం (పాకిస్తాన్- 414) తద్వారా అత్యధిక టెస్టు వికెట్లు కూల్చిన రెండో లెఫ్టార్మ్ పేసర్‌గా స్టార్క్ రికార్డు సాధించాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో యాషెస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్ ఇప్పటికే 110 వికెట్లు పూర్తి చేసుకోగా.. స్టార్క్ తాజాగా 100 వికెట్ల క్లబ్లో చేరాడు.ఇక స్టార్క్‌తో పాటు కామెరాన్ గ్రీన్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. నిలకడగా ఆడుతున్న వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (46)ను గ్రీన్ ఎల్బీడబ్ల్యూ చేసి ఆసీస్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేసింది.UPDATE: ఏడేసిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన ఇంగ్లండ్చదవండి: SL vs ZIM: శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే -
యాషెస్ తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందుకు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.హాజిల్‌వుడ్ ప్రస్తుతం తొడ కండరాల(హ్యామ్‌స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో జోష్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత అతడిని స్కాన్ కోసం అస్పత్రి తరలించారు. అయితే అతడిది తీవ్రమైన గాయం కానప్పటికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి టెస్టుకు అతడు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. ఆసీస్ సెలక్టర్లు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మైకేల్ నేసర్ జట్టులోకి చేర్చారు. హేజిల్‌వుడ్ గాయం కారణంగా, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది.తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అప్డేటడ్ స్క్వాడ్స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..? -
డే అండ్నైట్గా యాషెస్ సిరీస్
సిడ్నీ: వచ్చే ఏడాది ఆసీస్‌లో జరిగే యాషెస్ సిరీస్‌ను డే అండ్ నైట్‌గా మార్చే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంగ్లండ్ బోర్డుతో మాట్లాడలేదని చెప్పారు. అలాగే తమ దేశంలో పర్యటించే పాక్, దక్షిణాఫ్రికా జట్లతో కూడా ఇదే విధంగా ఆడేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. -
సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్
సిడ్నీ: వచ్చే యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ స్వదేశంలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 6 నుంచి భారత్‌తో జరిగే సిడ్నీ టెస్టు స్వదేశీ గడ్డపై ఆఖరిదని ప్రకటించాడు. ‘భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యాషెస్ సిరీస్ అనంతరం ఆటను ముగిద్దామనుకుంటున్నాను. అయితే ఇక్కడ చివరి టెస్టును ఘనంగా ముగించాలనుకుంటున్నాను’ అని 19 టెస్టులు ఆడి 1,384 పరుగులు చేసిన 37 ఏళ్ల రోజర్స్ అన్నాడు. ధోని గైర్హాజరీతో ఆసీస్‌కు లాభం: వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికిన ఎం.ఎస్.ధోని గైర్హాజరీ... నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని డాషింగ్ ఓపెనర్ వార్నర్ అన్నాడు. మ్యాచ్ గురించి మహి చాలా రకాలుగా ఆలోచిస్తాడని, అతను ఆటపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని ప్రశంసించాడు. ధోని స్థానంలో పగ్గాలు చేపట్టిన కోహ్లి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలన్న ఆతృత ఎక్కువైందని వార్నర్ అన్నాడు.


