చాంపియన్‌ రిత్విక్‌ జంట | ritwik wins itf title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ రిత్విక్‌ జంట

Jul 15 2017 10:31 AM | Updated on Sep 5 2017 4:06 PM

చాంపియన్‌ రిత్విక్‌ జంట

చాంపియన్‌ రిత్విక్‌ జంట

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి సత్తా చాటాడు.

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి సత్తా చాటాడు. నైరోబి జూనియర్‌ ఓపెన్‌ 2, గ్రేడ్‌–5 టెన్నిస్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో రిత్విక్‌ జోడీ విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

శుక్రవారం జరిగిన డబుల్స్‌ ఫైనల్లో రిత్విక్‌ (భారత్‌)–షేలి కొటేచా (కెన్యా) ద్వయం 6–2, 6–2తో అబ్దుల్లా అల్‌ బర్వాణి – అర్జున్‌ మరియప్ప (అమెరికా) జోడీపై గెలుపొందింది. సింగిల్స్‌ విభాగంలో రిత్విక్‌ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్స్‌లో 3–6, 2–6తో పాబ్లో స్కెల్‌చర్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. గతవారమే రిత్విక్‌ నైరోబి జూనియర్‌ ఓపెన్‌–1 డబుల్స్‌ టైటిల్‌నూ గెలుచుకున్నాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement