రిత్విక్‌ ‘డబుల్‌’ ధమాకా | ritwik gets double dhamaka | Sakshi
Sakshi News home page

రిత్విక్‌ ‘డబుల్‌’ ధమాకా

Jan 29 2018 11:09 AM | Updated on Jan 29 2018 11:09 AM

ritwik - Sakshi

రిత్విక్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–4 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ కుర్రాడు రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రిత్విక్‌ 4–6, 6–2, 6–0తో అబ్దుల్‌ షకుర్‌ కబురా (బురుండి)పై గెలుపొందాడు.

అంతకుముందు జరిగిన సెమీస్‌లో 6–3, 6–0తో గిలియన్‌ ఓస్మోంట్‌ (ఫ్రాన్స్‌)పై, క్వార్టర్స్‌లో 6–3, 6–0తో అలీ హబిద్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై విజయం సాధిం చాడు. మరోవైపు బాలుర డబుల్స్‌ టైటిల్‌పోరులో టాప్‌ సీడ్‌ రిత్విక్‌ (భారత్‌)–యాన్‌ అహ్మద్‌ (గ్రేట్‌ బ్రిటన్‌) జంట 6–1, 6–4తో అబ్దుల్‌ (బురుండి)–ర్యాన్‌ అటెటొ ర్యాండిక్‌ (కెన్యా) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement