రిషిక జోడికి డబుల్స్ టైటిల్ | rishika double title | Sakshi
Sakshi News home page

రిషిక జోడికి డబుల్స్ టైటిల్

Apr 11 2014 11:44 PM | Updated on Sep 2 2017 5:54 AM

రిషిక జోడికి డబుల్స్ టైటిల్

రిషిక జోడికి డబుల్స్ టైటిల్

అంతర్జాతీయు టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీలో తెలుగు అమ్మాయి రిషిక సుంకర డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 సింగిల్స్ సెమీస్‌లో ఓడిన నిధి

  ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ
 
 చెన్నై: అంతర్జాతీయు టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీలో తెలుగు అమ్మాయి రిషిక సుంకర డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తన భాగస్వామి షర్మదా బాలు (భారత్)తో కలిసి ఆడిన రిషిక ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో 6-0, 7-6(7/4)తో నటాషా-ప్రార్థన (భారత్) జోడిపై విజయం సాధించింది.

 

మరోవైపు సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల పరాజయం పాలైంది. ఆరో సీడ్ నిధి 3-6, 5-7తో టాప్ సీడ్ ప్రార్థన (భారత్) చేతిలో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ ఇతీ మెహతా (భారత్) 3-6, 7-5, 6-3తో రెండో సీడ్ నటాషా (భారత్)పై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకుంది. నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఇతీ మెహతా, ప్రార్థన అమీతుమీ తేల్చుకోనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement