లీ చోంగ్ వీకి ఊరట | relief to Lee Chong | Sakshi
Sakshi News home page

లీ చోంగ్ వీకి ఊరట

Apr 28 2015 1:15 AM | Updated on Sep 3 2017 12:59 AM

లీ చోంగ్ వీకి ఊరట

లీ చోంగ్ వీకి ఊరట

డోపింగ్‌లో పట్టుబడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లీ చోంగ్ వీ (మలేసియా)పై ఎనిమిది నెలల నిషేధం విధించారు.

కౌలాలంపూర్: డోపింగ్‌లో పట్టుబడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లీ చోంగ్ వీ (మలేసియా)పై ఎనిమిది నెలల నిషేధం విధించారు. అయితే 33 ఏళ్ల లీ చోంగ్ వచ్చే నెలలోనే తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విధించిన ఈ నిషేధం గతేడాది ఆగస్టు 30 నుంచి వర్తించనుంది.

దీంతో మే నెలలోనే ఈ నిషేధం తొలగిపోనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీ సందర్భంగా తీసిన డోపింగ్ శాంపిల్‌లో లీ చోంగ్ వీ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో నవంబర్ 11న తాత్కాలిక నిషేధం విధించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement