మెయిన్‌ డ్రా పోటీలకు రష్మిక | Rashmika In Main Draw Of Fenesta Open | Sakshi
Sakshi News home page

మెయిన్‌ డ్రా పోటీలకు రష్మిక

Sep 30 2019 10:06 AM | Updated on Sep 30 2019 10:06 AM

Rashmika In Main Draw Of Fenesta Open - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ మహిళల టెన్నిస్‌ టోర్నీ మెయిన్‌ డ్రా పోటీలకు తెలంగాణ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక అర్హత సాధించింది. న్యూఢిల్లీలోని ఆర్‌కే ఖన్నా స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీలో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన రషి్మక మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్‌లో శ్రీవల్లి రష్మిక  9–2తో ఈశ్వరి (మహారాష్ట్ర)పై గెలుపొందగా... రెండో రౌండ్‌లో 9–0తో అద్రిజా బిశ్వాస్‌ (పశ్చిమ బెంగాల్‌)ను ఓడించింది. తర్వాత జరిగిన ఫైనల్‌ రౌండ్‌లో 6–0, 6–2తో కిరణ్‌ కల్కల్‌ (ఢిల్లీ)పై గెలుపొంది మెయిన్‌ డ్రాలో అడుగుపెట్టింది.  

Advertisement
 
Advertisement
Advertisement