‘మా మాజీ కెప్టెన్‌వి చెత్త మాటలు’ | Rashid hits back at Vaughan for stupid comments | Sakshi
Sakshi News home page

‘మా మాజీ కెప్టెన్‌వి చెత్త మాటలు’

Jul 27 2018 8:33 PM | Updated on Jul 27 2018 8:40 PM

Rashid hits back at Vaughan for stupid comments - Sakshi

లండన్‌: తనను ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌లో తిరిగి ఎంపిక చేయడాన్ని తప్పుబట్టిన మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వ్యాఖ్యలపై స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ మండిపడ్డాడు. తాను టెస్టు క్రికెట్‌కు పనికిరానంటూ వాన్‌ వ్యాఖ్యానించడం కచ్చితంగా మూర్ఖత్వంతో కూడుకున్నదని, అవి అసలు లెక్కలోకే రాదని విమర్శించాడు. సుదీర్ఘ కాలంగా టెస్టు క్రికెట్‌ ఆడని  రషీద్‌ను మళ్లీ ఆ ఫార్మాట్‌లో ఎంపిక చేయడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. మైకేల్‌ వాన్‌ అయితే ‘హాస్యాస్పదం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై  స్పందించిన రషీద్‌.. ‘మైకేల్‌ వాన్‌ చాలా మాట్లాడతాడు. వాటిని అందరూ వింటారని భావిస్తుంటాడు. కానీ అతడి అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోరు. ఈ ఏడాది ఆరంభంలో నేను ఎరుపు బంతి క్రికెట్‌ ఆడనని చెప్పినప్పుడూ అతడేదో అన్నాడు. అతనెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనే కోరుకుంటాడు.  నాపై వాన్‌కు దురుద్దేశం ఉందనుకోను. అతడి కెప్టెన్సీలో అతడితో పాటూ ఆడాను. చేయడానికి ఏదీ తోచనప్పుడు, బోర్‌ కొట్టినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ప్రధానంగా మాజీ క్రికెటర్లు ఏదొక మాట్లాడటాన్ని పనిగా పెట్టుకుంటారు’ అని రషీద్‌ ఎద్దేవా చేశాడు.

చదవండి: రషీద్‌ను మళ్లీ రప్పించారు..! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement