హైదరాబాద్ ‘డ్రా’తో సరి | Ranji Trophy Roundup: Andhra, Punjab, Gujarat post wins; Mumbai, Goa, Services play out draws | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ‘డ్రా’తో సరి

Dec 18 2014 12:39 AM | Updated on Sep 4 2018 5:07 PM

రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు తడబడటంతో గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకుంది.

గోవాతో రంజీ మ్యాచ్
 సాక్షి, హైదరాబాద్: రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు తడబడటంతో గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఆట చివరిరోజు బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 238/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గోవా 269 పరుగులవద్ద ఆలౌటైంది. రవి కిరణ్ (2/36), ఆశిష్ రెడ్డి (2/41), ప్రజ్ఞాన్ ఓజా (2/98) రెండేసి వికెట్లు తీయగా... సీవీ మిలింద్ (3/63) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన హైదరాబాద్ తమ ప్రత్యర్థి గోవా జట్టును ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో గోవా 68 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. ఓపెనర్ అమోగ్ సునీల్ దేశాయ్ (192 బంతుల్లో 9 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించాడు.  తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినందుకు హైదరాబాద్‌కు మూడు పాయింట్లు లభించగా... గోవాకు ఒక పాయింట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement