రాంచీ రేస్ విజయం | Ranchi race won | Sakshi
Sakshi News home page

రాంచీ రేస్ విజయం

Feb 4 2015 12:57 AM | Updated on Sep 2 2017 8:44 PM

రాంచీ రేస్ విజయం

రాంచీ రేస్ విజయం

హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఈ జట్టుపై 2-0తో రాంచీ రేస్ విజయం సాధించింది.

లక్నో: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఈ జట్టుపై 2-0తో రాంచీ రేస్ విజయం సాధించింది. ప్రారంభం నుంచే రెండు జట్లు దూకుడును కనబరిచాయి. రెండో నిమిషంలోనే రాంచీ పెనాల్టీ కార్నర్ అవకాశం పొందినా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.

11వ నిమిషంలో విజార్డ్స్‌కు వచ్చిన పెనాల్టీ కార్నర్ విఫల మైంది. అయితే 13వ నిమిషంలో ప్రత్యర్థి లోపాలను ఆసరాగా చేసుకుని స్ట్రయికర్ ట్రెంట్ మిట్టన్ తొలి గోల్ చేసి రాంచీకి ఆధిక్యాన్ని అందించాడు. విజార్డ్స్ డిఫెన్స్‌ను ఏమార్చుతూ 42వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ చేసిన గోల్‌తో రాంచీకి రెండో గోల్ దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement