ఎన్‌సీఏ కోచ్‌లుగా | Raman, Hirwani, Sekar appointed NCA coaches | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఏ కోచ్‌లుగా

Dec 24 2015 1:10 AM | Updated on Sep 3 2017 2:27 PM

మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యు.వి. రామన్, నరేంద్ర హిర్వాణీ, టీఏ శేఖర్‌లను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్యానెల్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది.

రామన్, హిర్వాణీ, శేఖర్
 ముంబై:
మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యు.వి. రామన్, నరేంద్ర హిర్వాణీ, టీఏ శేఖర్‌లను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్యానెల్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది. రామన్ బ్యాటింగ్, శేఖర్ పేస్ బౌలింగ్, హిర్వాణీ స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా పని చేస్తారని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. మరికొంత మంది అసిస్టెంట్ కోచ్‌లు వీళ్లకు సహాయ సహకారాలు అందజేస్తారన్నారు.
 
  ఎన్‌సీఏ డెరైక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ త్రయాన్ని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేశారని చౌదరి తెలిపారు. ఎన్‌సీఏను శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేసేందుకు బెంగళూరులో స్థలం కోసం అన్వేషిస్తున్నామన్నారు. నెల రోజుల్లో అనువైన స్థలం లభించకపోతే అకాడమీని వేరే చోటుకు తరలిస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement