భారత వెయిట్‌లిఫ్టర్‌ రాఖీ హల్దర్‌కు కాంస్యం | Rakhi Halder Creates Two National Records | Sakshi
Sakshi News home page

భారత వెయిట్‌లిఫ్టర్‌ రాఖీ హల్దర్‌కు కాంస్యం

Dec 24 2019 10:13 AM | Updated on Dec 24 2019 10:13 AM

 Rakhi Halder Creates Two National Records - Sakshi

దోహాలో జరిగిన ఖతర్‌ కప్‌ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. మహిళల 64 కేజీల విభాగంలో రాఖీ హల్దర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచింది. రాఖీ మొత్తం 218 కేజీలు (స్నాచ్‌లో 85 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 123 కేజీలు) బరువెత్తింది. ఈ క్రమంలో రాఖీ 214 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ సీనియర్‌ రికార్డును సవరించింది.

టోక్యో ఒలింపిక్స్‌ సిల్వర్‌ స్థాయి అర్హత టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఖతర్‌ కప్‌లో ఓవరాల్‌గా భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో మీరాబాయి చాను స్వర్ణం, జెరెమీ లాల్‌రినుంగా రజతం సాధించారు.   

Advertisement
 
Advertisement
Advertisement