కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యం 153 | Rajasthan set target of 153 runs against Kings Punjab | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యం 153

May 6 2018 9:47 PM | Updated on May 6 2018 9:47 PM

Rajasthan set target of 153 runs against Kings Punjab - Sakshi

ఇండోర్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఆదివారం ఇక్కడ హోల్కర్‌ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్తాన్‌ ఆటగాళ్లలో జాస్‌ బట్లర్‌(51;39 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆ తర్వాత సంజూ శాంసన్‌(28;23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌(24‌)లు ఫర్వాలేదనిపించారు.

టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే డీ ఆర్సీ షార్ట్‌(2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్‌ బట్లర్‌కు కెప్టెన్‌ రహానే జత కలిశాడు. కాగా, రహానే(5) కూడా వైఫల్యం చెందడంతో రాజస్తాన్‌ 35 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్‌-శాంసన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్‌ ఔటయ్యాడు. అటు తర్వాత రాజస్తాన్‌ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, అక్షర్‌ పటేల్‌లకు తలో వికెట్‌ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement