సౌతీ.. వాటే ఏ క్యాచ్‌ | Raina gets out an excellent catch by Southee | Sakshi
Sakshi News home page

సౌతీ.. వాటే ఏ క్యాచ్‌

May 5 2018 6:54 PM | Updated on May 5 2018 7:12 PM

Raina gets out an excellent catch by Southee - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు టిమ్‌ సౌతీ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. లాంగాన్‌లో బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ను పట్టుకుని  సౌతీ నియంత్రణను కోల్పోయే క్రమంలో బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ అంతే వేగంగా తిరిగొచ్చి బంతిని అందుకున్న తీరు ఆకట్టుకుంది.

వివరాల్లోకి వెళితే.. చెన్నై  ఇన్నింగ్స్‌లో భాగంగా ఆర్సీబీ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాల్గో బంతిని సురేశ్‌ రైనా లాంగాన్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు.  అయితే  ఆ బంతి సిక్స్‌ అవుతుందనే భ్రమ పడే లోపే సౌతీ బంతిని బౌండరీ లైన్‌కు అంగుళం దూరంలో అందుకున్నాడు. ఆ క్రమంలోనే బంతిని చాకచక్యంగా గాల్లోకి ఎగరేసి బౌండరీలైన్‌ దాటాడు. ఆపై వెంటనే బౌండరీ లైన్‌ లోపలికి తిరిగొచ్చి బంతిని పట్టుకోవడంతో రైనా భారంగా పెవిలియన్‌ వీడాడు. ఈ క్యాచ్‌కు సంబంధించి థర్ఢ్‌ అంపైర్‌ పదే పదే రిప్లేలో చూసిన తర్వాత రైనాను ఔట్‌గా ప్రకటించాడు.

Advertisement
 
Advertisement
Advertisement