దుబాయ్ చెస్ టోర్నీలో సత్తాచాటిన రాహుల్ | rahul srivasthava runnerup at dubai chess tourney | Sakshi
Sakshi News home page

దుబాయ్ చెస్ టోర్నీలో సత్తాచాటిన రాహుల్

Jul 28 2016 8:48 AM | Updated on Sep 4 2017 6:46 AM

దుబాయ్ చెస్ టోర్నీలో సత్తాచాటిన రాహుల్

దుబాయ్ చెస్ టోర్నీలో సత్తాచాటిన రాహుల్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి. రాహుల్ శ్రీవాస్తవ దుబాయ్ జూనియర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మెరిశాడు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి. రాహుల్ శ్రీవాస్తవ దుబాయ్ జూనియర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మెరిశాడు. దుబాయ్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అతను రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు స్విస్ లీగ్ ఫార్మాట్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో అతను 7.5 పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు... ఒకే ఒక్క మ్యాచ్‌లో మొహమ్మద్ రహమాన్ (బంగ్లాదేశ్) చేతిలో ఓడాడు.

రహమాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఏడున్నర పాయింట్లతో రాహుల్‌తో కలిసి మట్విషెన్ విక్టర్ (ఉక్రెయిన్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో రాహుల్‌కు రెండు, విక్టర్ మూడో స్థానం దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కుర్రాడికి పతకంతో పాటు రూ. లక్షా 5వేల (1600 డాలర్లు) ప్రైజ్‌మనీ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement