‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’ | PV Sindhu will come back stronger on another day to beat Carolina Marin: Gopichand | Sakshi
Sakshi News home page

‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’

Aug 20 2016 9:18 AM | Updated on Sep 4 2017 10:06 AM

‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’

‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’

తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు.

రియో డీ జనీరో: గత కొద్ది రోజులుగా పీవీ సింధు అద్భుతంగా ఆడుతోందని, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఆటతీరు తాను గర్వించేలా ఉందని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు వెండి పతకం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టులో ఆమె కదిలిన తీరు, పోరాట పటిమ నిరుపమానమని కొనియాడాడు. తమ కష్టానికి ఫలితం దక్కిందని, సింధు అత్యుత్తమంగా ఆడిందన్నాడు.

తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందని, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. సింధు మళ్లీ పుంజుకుంటుందని, ఏదోక రోజు మారిన్ ను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండో గేమ్ మొదట్లో సింధు తడబడిందని, మూడో గేమ్ కొన్ని అనవసర తప్పిదాల వల్ల సింధు మ్యాచ్ కోల్పోయిందని విశ్లేషించాడు. చిన్నవయసులోనే సింధు ఒలింపిక్ పతకం సాధించిందని, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని చెప్పాడు. సింధు బాగా శ్రమిస్తుందని, భవిష్యత్ లో ఆమె అగ్రశేణి క్రీడాకారిణి అవుతుందని గోపీచంద్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement