ఒలింపిక్‌ డే వేడుకల్లో పీవీ సింధు | PV Sindhu Will Attend In Worldwide Olympic Day Celebration | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ డే వేడుకల్లో పీవీ సింధు

Jun 20 2020 2:37 AM | Updated on Jun 20 2020 2:37 AM

PV Sindhu Will Attend In Worldwide Olympic Day Celebration - Sakshi

న్యూఢిల్లీ: ‘ఒలింపిక్‌ డే’ వేడుకల్లో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్స్‌ రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు భాగం కానుంది. జూన్‌ 23న ఒలింపిక్‌ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన 23 మంది ప్రముఖ అథ్లెట్లు తమ వర్క్‌అవుట్‌ వీడియోలను అభిమానులతో పంచుకోనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన పీవీ సింధుతో పాటు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కూడా పాల్గొననుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సింధు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌కు సంఘీభావంగా క్రీడాకారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement