ఇండియా ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు  | PV Sindhu in India Open Final | Sakshi
Sakshi News home page

ఇండియా ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు 

Feb 4 2018 1:20 AM | Updated on Feb 4 2018 9:58 AM

PV Sindhu in India Open Final - Sakshi

పీవీ సింధు

ఈ ఏడాది తాను ఆడుతోన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 21–13, 21–15తో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది.

నేడు జరిగే ఫైనల్లో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో సింధు ఆడుతుంది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 16–21, 19–21తో క్రిస్టియాన్సన్‌–క్రిస్టినా (డెన్మార్క్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement