సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్ | punjab marshalls wins champions tennis league | Sakshi
Sakshi News home page

సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్

Dec 7 2015 2:46 AM | Updated on Sep 3 2017 1:36 PM

సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్

సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్

చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్‌లో పంజాబ్ మార్షల్స్ జట్టు విజేతగా నిలిచింది.

- ఫైనల్లో హైదరాబాద్ ఏసెస్‌కు నిరాశ

సాక్షి, హైదరాబాద్:
చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్‌లో పంజాబ్ మార్షల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ 5-4, 5-4, 2-5, 5-4, 5-4 (22-21 గేమ్‌ల) తేడాతో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది పంజాబ్ అజేయంగా నిలువడం విశేషం. ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో గ్రెగ్ రుసెద్‌స్కీ 5-4తో థామస్ జొహన్సన్‌ను ఓడించి పంజాబ్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ఎలీనా స్వితోలినా 5-4తో మార్టినా హింగిస్‌ను ఓడించింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో ఏసెస్ జోడి హింగిస్-కార్లోవిచ్  5-2తో స్వితోలినా-బాగ్దాటిస్‌పై గెలిచి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించారు. అయితే పురుషుల డబుల్స్‌లో మార్షల్స్ ద్వయం బాగ్దాటిస్-సాకేత్ మైనేని 5-4తో కార్లోవిచ్-జీవన్ జంటను చిత్తు చేశారు. అనంతరం టోర్నీ చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 5-4తో కార్లోవిచ్‌ను ఓడించి పంజాబ్‌కు విజయం ఖాయం చేశాడు. హింగిస్‌కు మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్, సాకేత్‌కు బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవార్డు దక్కాయి. విజేత పంజాబ్ జట్టుకు రూ. కోటి, రన్నరప్ హైదరాబాద్ ఏసెస్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement