పుల్లెల గోపీచంద్‌ అకాడమీ ప్రతిభాన్వేషణ కార్యక్రమం

Pullela Gopichand Academy is a replication program - Sakshi

బ్యాడ్మింటన్‌ క్రీడలో ఓనమాలు దిద్దుతోన్న చిన్నారులకు మంచి అవకాశం. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ సంయుక్తంగా కొత్త టాలెంట్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీని ప్రకారం అండర్‌–10 స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ శిక్షణకు ఎంపికవ్వాలంటే చిన్నారులు బ్యాడ్మింటన్‌ ఆడుతున్న 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈనెల 28వ తేదీలోపు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోని ‘ఐడీబీఐ ఫెడరల్‌ క్వెస్ట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ పేజీల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఫుట్‌వర్క్, స్పీడ్, ఆడే తీరు, రాకెట్‌ సమన్వయం తదితర అంశాలను పరిశీలించి 10–15 మంది చిన్నారులను ఎంపిక చేస్తామని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ తెలిపారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top