నేను ఆశ్చర్యపోయా: విజయ్‌ శంకర్‌

Promotion to number three was a big surprise: Vijay Shankar - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ విజయ్‌ శంకర్‌ భారీ షాట్లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా చివరిదైన మూడో టీ20లో విజయ్‌ శంకర్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి అభిమానుల్ని అలరించాడు. కాగా, ఈ మూడు టీ20ల సిరీస్‌లో రెండు, మూడు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో(ఫస్ట్‌డౌన్‌) బ్యాటింగ్‌కు పంపడం తనను ఆశ‍్చర్యానికి గురి చేసిందని విజయ్‌ శంకర్‌ స్పష్టం చేశాడు.

‘ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగమని టీమిండియా మేనేజ్‌మెంట్‌ అడగడం నిజంగా నాకు పెద్ద సర్‌ప్రైజ్‌. అది చాలా గొప్ప విషయం. ఇలా నన‍్ను మూడో స్థానానికి ప్రమోట్‌ చేయడంతో ఆశ్చర్యపోయా. దాంతో పరిస్థితిని బట్టి బ్యాటింగ్‌ చేయడంపై దృష్టి సారించా. జట్టు అవసరల కోసం ఎక్కడైనా బ్యాటింగ్‌కు దిగాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ రెండు సిరీస్‌ల్లో నాకు ఎక్కువ బౌలింగ్‌ వేసే అవకాశం రాకపోవచ్చు.. కానీ వేర్వేరు వాతావారణ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్‌ చేయాలనేది తెలుసుకున్నా. ఇక బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్‌, ఎంఎస్‌ ధోనిల వంటి సీనియర్లతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. వారి ఆటను దగ్గర్నుంచి చూసే అవకాశం దక్కింది. చివరి మ్యాచ్‌లో భారీ షాట్లు ఆడా. దాంతో పాటు సింగిల్స్‌, డబుల్స్‌ కూడా తీయాల్సింది. ఇది కూడా నాకు పాఠమే’ అని విజయ్‌ శంకర్‌ తెలిపాడు.

ఇక్కడ చదవండి: ఆ బాల్‌ వైడ్‌గా ఇచ్చుంటే..

మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top