జనవరి 30 నుంచి ప్రొ కబడ్డీ | pro kabaddi starts from January 30 | Sakshi
Sakshi News home page

జనవరి 30 నుంచి ప్రొ కబడ్డీ

Dec 10 2015 2:45 AM | Updated on Sep 3 2017 1:44 PM

క్రీడాభిమానుల ఆదరణను చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్‌ను ఇకపై ఏడాదిలో రెండు సార్లు నిర్వహించనున్నారు.

ముంబై: క్రీడాభిమానుల ఆదరణను చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్‌ను ఇకపై ఏడాదిలో రెండు సార్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు సార్లు జరిగిన ఈ టోర్నీ విజయవంతమైంది. సీజన్-2 ముగిసిన ఐదు నెలల్లోపే మళ్లీ లీగ్‌ను జరుపుతుండటం విశేషం. ప్రొ కబడ్డీ సీజన్-3 వచ్చే జనవరి 30నుంచి జరుగుతుంది.  ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. తొలి మ్యాచ్‌లో యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. ఫైనల్ మార్చి 6న న్యూఢిల్లీలో జరుగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement