యు ముంబా జోరు | Pro Kabaddi 2018 Highlights: Dabang Delhi beat U Mumba | Sakshi
Sakshi News home page

యు ముంబా జోరు

Dec 2 2018 12:58 AM | Updated on Dec 2 2018 12:58 AM

Pro Kabaddi 2018 Highlights: Dabang Delhi beat U Mumba  - Sakshi

న్యూఢిల్లీ: రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా పన్నెండో విజయం నమోదు చేసుకుంది. జోన్‌ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో యు ముంబా 41–34తో దబంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి 13–22తో వెనుకంజలో ఉన్న యు ముంబా ఆ తర్వాత చెలరేగింది.

సిద్ధార్థ్‌ (19 పాయింట్లు) రైడింగ్‌లో విజృంభించడంతో క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లి అలవోకగా గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్‌ కుమార్‌ 12 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. జోన్‌ ‘ఎ’లో 17 మ్యాచ్‌లు ఆడిన యు ముంబా 67 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జోన్‌ ‘బి’లో 58 పాయింట్లతో బెంగళూరు టాప్‌లో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో యు ముంబా, పుణేరి పల్టన్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడనున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement