ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు | Pre-quarterfinals Saina, Sindhu | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు

Mar 17 2016 12:17 AM | Updated on Sep 3 2017 7:54 PM

ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు

ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు

స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు ప్రిక్వార్టర్ ....

బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సైనా 21-7, 21-15తో కరీన్ షానాస్ (జర్మనీ)పై గెలుపొందగా... ఆరో సీడ్ సింధు 21-19, 21-10తో చోల్ మజీ (ఐర్లాండ్)ను ఓడించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో క్రిస్టినా గావ్న్‌హోల్ట్ (చెక్ రిపబ్లిక్)తో సైనా, పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.

బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సాయిప్రణీత్ 21-7, 21-10తో అర్త్‌యోమ్ సవత్‌యుజిన్ (ఉజ్బెకిస్తాన్)పై, ప్రణయ్ 21-16, 21-13తో లార్స్ షాన్‌జ్లెర్ (జర్మనీ)పై గెలుపొందారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-14, 13-21, 21-6తో మథియాస్ బోనీ (స్విట్జర్లాండ్)పై, ప్రణయ్ 21-19, 21-19తో కోల్జోనెన్ (ఫిన్‌లాండ్)పై విజయం సాధించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-8, 21-17తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై, సమీర్ వర్మ 21-17, 24-22తో ఎమిల్ హోల్స్‌ట్ (డెన్మార్క్)పై గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement