ప్రాంజల జంటకు డబుల్స్‌ టైటిల్‌ | pranjula pair clinch double title of ITF | Sakshi
Sakshi News home page

ప్రాంజల జంటకు డబుల్స్‌ టైటిల్‌

Jun 11 2017 2:26 PM | Updated on Sep 5 2017 1:22 PM

ప్రాంజల జంటకు డబుల్స్‌ టైటిల్‌

ప్రాంజల జంటకు డబుల్స్‌ టైటిల్‌

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మెరిసింది.

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

ఔరంగాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మెరిసింది. స్థానిక క్లే ఔట్‌డోర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి జియోజి జావోతో కలి సి డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివా రం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో ప్రాంజల–జియోజి జావో (చైనా) ద్వయం 2–6, 6–3, 10–4తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రుతుజ–కనిక వైద్య (భారత్‌) జంటపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల జంట ఒక ఏస్‌ సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. జూనియర్‌ స్థాయిలో నాలుగు డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన 18 ఏళ్ల ప్రాంజలకు సీనియర్‌ ప్రొ సర్క్యూట్‌లో మాత్రం ఇదే తొలి డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.  

 

Advertisement
 
Advertisement
Advertisement