ప్రాంజల జోడీకి టైటిల్‌ | Pranjala Pair got Title | Sakshi
Sakshi News home page

ప్రాంజల జోడీకి టైటిల్‌

Aug 11 2018 10:18 AM | Updated on Aug 11 2018 10:19 AM

Pranjala Pair got Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డబుల్స్‌ కేటగిరీలో భారత్‌కు చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల టైటిల్‌ను గెలుచుకోగా... సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌లో పరాజయం పాలైంది.

థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ ప్రాంజల–రుతుజ ద్వయం 2–6, 6–0, 10–6తో టాప్‌ సీడ్‌ బైన్స్‌ నయ్‌క్తా (ఆస్ట్రేలియా)–స్టెఫ్‌కోవా బార్బోరా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రాంజల 3–6, 6–2, 2–6తో వాంగ్‌ జియు (చైనా) చేతిలో ఓటమి పాలైంది.  

Advertisement
 
Advertisement
Advertisement