పవర్‌గ్రిడ్ కబడ్డీ టోర్నీ షురూ | power grid kabadday tourny starts | Sakshi
Sakshi News home page

పవర్‌గ్రిడ్ కబడ్డీ టోర్నీ షురూ

Sep 29 2016 10:47 AM | Updated on Sep 4 2017 3:31 PM

సదరన్ రీజియన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్: సదరన్ రీజియన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లకు చెందిన ఉద్యోగులు ఈ  టోర్నీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నారు. దాదాపు 120 మంది వివిధ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సదరన్ రీజియన్ (సికింద్రాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి. శేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement