breaking news
kabaddy tourny
-
పవర్‌గ్రిడ్ కబడ్డీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: సదరన్ రీజియన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లకు చెందిన ఉద్యోగులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నారు. దాదాపు 120 మంది వివిధ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సదరన్ రీజియన్ (సికింద్రాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి. శేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. -
ఎస్సీఆర్ జట్టుకే టైటిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి వార్షిక ఎ-లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ఎస్సీఆర్ జట్టు 20-12తో ఇన్కమ్ టాక్స్ జట్టుపై అవలీలగా విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్సీఆర్ తరఫున ప్రదీప్, అంకిరెడ్డి రాణించగా... ఇన్కమ్ టాక్స్ జట్టులో శ్రీకృష్ణ, మల్లేశ్ ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇన్కమ్ టాక్స్ జట్టు 16-8తో ఆంధ్రా బ్యాంక్‌పై గెలుపొందగా... రెండో సెమీస్‌లో ఎస్సీఆర్ జట్టు 16-6తో ‘సాయ్’ ఎసీటీసీ జట్టును ఓడించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ దినకర్‌బాబు పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.