అజ్మల్ పరీక్షకు తేది నిర్ణయించండి | PCB asks ICC for date to test Ajmal | Sakshi
Sakshi News home page

అజ్మల్ పరీక్షకు తేది నిర్ణయించండి

Dec 3 2014 12:14 AM | Updated on Mar 23 2019 8:48 PM

తమ జట్టు ప్రధాన బౌలర్ సయీద్ అజ్మల్‌ను ప్రపంచ కప్ బరిలోకి దించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుదలగా ఉంది. అందు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోన్న పాకిస్థాన్...

ఐసీసీని కోరిన పాక్ క్రికెట్ బోర్డు
 కరాచీ: తమ జట్టు ప్రధాన బౌలర్ సయీద్ అజ్మల్‌ను ప్రపంచ కప్ బరిలోకి దించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుదలగా ఉంది. అందు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోన్న పాకిస్థాన్...‘చకింగ్’ ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన అజ్మల్ యాక్షన్‌ను వెంటనే మరోసారి పరిశీలించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేసింది.
 
 అజ్మల్ అధికారిక బయోమెకానికల్ పరీక్ష కోసం తేదీని నిర్ణయించమని కోరింది. గత సెప్టెంబర్‌లో సస్పెన్షన్ అనంతరం అజ్మల్... పాక్ మాజీ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ పర్యవేక్షణలో తన యాక్షన్‌ను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అతను ఇప్పటికే రెండు సార్లు అనధికారిక పరీక్షలో పాల్గొన్నాడు. ఇందులో సాధారణ బంతులను అతను పరిమితికి లోబడే విసిరినా, దూస్రా వేసేటప్పుడు మాత్రం 15 డిగ్రీల నిబంధనను ఉల్లంఘిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement