ఐపీఎల్‌ 2018: పరిణీతి చోప్రా షాకింగ్‌ న్యూస్‌

Parineeti Chopra Pulls Out Of IPL 2018 Opening Ceremony - Sakshi

సాక్షి, ముంబై : ఐపీఎల్‌ 2018 ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడే స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌ నటీనటులు అలరించబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం రణ్‌వీర్‌ సింగ్‌, పరిణీతి చోప్రా, వరుణ్‌ ధావన్‌, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు స్టేజీపై తమ ప్రదర్శన ఇవ్వాల్సిఉంది. ఇప్పటికే గాయం కారణంగా రణ్‌వీర్‌సింగ్‌ ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల నుంచి తప్పుకోవడంతో  హృతిక్ రోషన్‌ పాల్గొంటున్న విషయం తెలిసిందే. 

కాగా ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభ వేడుకలకు ఒక్క రోజు ముందు ఐపీఎల్‌ నిర్వాహకులకు పరిణీతి చోప్రా షాక్‌ ఇచ్చారు. విరామం లేని షూటింగలతో బిజీగా ఉండటంతో ఈ మెగా ఈవెంట్‌లో చేయబోయే ప్రదర్శనకు పూర్తి స్థాయిలో సాధన చేయలేదని వివరించారు. ప్రదర్శనకు సరిగా ప్రాక్టీస్‌ లేకుండా పాల్గోనడం తనకు నచ్చదని అందుకే ప్రారంభవేడుకల్లో ప్రదర్శన చేయబోనని ఈవెంట్‌ ప్రొడ్యూసర్‌లకు ఈ బాలీవుడ్‌ బ్యూటీ చెప్పేసిందని సమాచారం. మరీ ఐపీఎల్‌ నిర్వాహకులు పరిణీతి చోప్రా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. పరిణీతి పాల్గోనకపోతే ఈ వేడుకకి గ్లామర్‌ తగ్గిపోతదనే ఆలోచనలో ఐపీఎల్‌ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top