పాక్ కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా తిరస్కరణ | Pakistan refuse to accept Azhar Ali's resignation over Amir's inclusion | Sakshi
Sakshi News home page

పాక్ కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా తిరస్కరణ

Dec 30 2015 12:53 AM | Updated on Mar 23 2019 8:29 PM

పాక్ కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా తిరస్కరణ - Sakshi

పాక్ కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా తిరస్కరణ

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనంపై ఆ జట్టులో డ్రామా కొనసాగుతోంది.

లాహోర్: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనంపై ఆ జట్టులో డ్రామా కొనసాగుతోంది. ఆమిర్‌ను జాతీయ శిక్షణ శిబిరంలో చేర్చడాన్ని నిరసిస్తూ తాజాగా వన్డే కెప్టెన్ అజహర్ అలీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ బుజ్జగింపులతో అతను తన రాజీమానాను వెనక్కి తీసుకున్నాడు.

జాతీయ శిబిరంలో ఆమిర్ ఉంటే తాము హాజరుకామని గత గురువారం అజహర్, హఫీజ్‌లు నిరసన ప్రకటించారు. అయితే పాక్ బోర్డు జోక్యంతోనే ఇది సద్దుమణిగింది. న్యూజిలాండ్ పర్యటన కోసం సిద్ధమవుతున్న 26 మంది సభ్యుల పాక్ బృందంలో ఆమిర్‌ను ఎంపిక చేశారు. తన తప్పును క్షమించాలని, నిజంగా తన వల్ల సమస్య ఉంటే తానే వెళ్లిపోతానని కూడా ఆమిర్ నేరుగా అజహర్, హఫీజ్‌లకు క్షమాపణ కూడా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement