ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్ | Pakistan legend Zaheer Abbas takes over as ICC President | Sakshi
Sakshi News home page

ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్

Jun 25 2015 9:35 AM | Updated on Sep 3 2017 4:21 AM

ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్

ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్‌ నియమితులైయ్యారు. పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథి తప్పుకోవడంతో అబ్బాస్ పేరును పాక్ ప్రతిపాదించింది.

కరాచీ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్‌ నియమితులైయ్యారు. రేసు నుంచి  పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథి తప్పుకోవడంతో అబ్బాస్ పేరును పాక్ ప్రతిపాదించింది. దీంతో  అబ్బాస్ పేరు ప్రతిపాదనకు ఐసీసీ తాజాగా  ఆమోద ముద్ర వేయడంతో దీనిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తన నామినేషన్ ను ఆమోదించినందుకు ఐసీసీకి అబ్బాస్ కృతజ్ఞతలు తెలియజేశాడు. 'నాపై నమ్మకం ఉంచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, ఐసీసీకి ధన్యవాదాలు. శక్తివంచన లేకుండా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడతా' అని అబ్బాస్ స్పష్టం చేశాడు.

 

ఈ పదవి కోసం మాజీ ఆటగాళ్లు మాజిద్ ఖాన్, అసిఫ్ ఇక్బాల్ పేర్లు తెరపైకి వచ్చినా పీసీబీ గవర్నింగ్ బాడీ మాత్రం జహీర్ అబ్బాస్ వైపే మొగ్గు చూపింది. ఆసియా బ్రాడ్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అబ్బాస్ 78 టెస్టుల్లో 5062 పరుగులు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం జూలై 1 నుంచి ఏడాది కాలం నజమ్ సేథి ఈ పదవిని చేపట్టాల్సి ఉంది. అయితే గతేడాది నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ టెస్టు ఆటగాళ్లనే ప్రతిపాదించాలని ప్రపంచ క్రికెట్ బాడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందుగానే సేథి తప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement