సర్ఫరాజ్‌... ఇమ్రాన్‌ కాగలడా!

Pakistan is coming to the World Cup - Sakshi

రెండో టైటిల్‌ వేటలో పాకిస్తాన్‌

అనూహ్య ప్రదర్శనకు అవకాశం

నిలకడలేమి సమస్య

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్‌ గడ్డపై చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన తర్వాత పాకిస్తాన్‌ జట్టు 38 వన్డేలు ఆడితే 15 గెలిచింది. ఇందులో జింబాబ్వే, హాంకాంగ్, అఫ్గానిస్తాన్, బలహీన శ్రీలంకలపైనే 12 వచ్చాయి. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో తలపడినప్పుడు 23 మ్యాచ్‌లలో ఓడిపోయి 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. వరుసగా 11 వన్డేల్లో పరాజయం తర్వాత ఇప్పుడు పాక్‌ ప్రపంచ కప్‌ బరిలోకి దిగుతోంది. మొదటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ చేతిలో కూడా చావుదెబ్బ తింది.

ఈ గణాంకాలు చూస్తే ఏ జట్టయినా పాకిస్తాన్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి! కానీ అలా ఎవరైనా భావిస్తే అది స్వయంకృతాపరాధమే అవుతుంది. ఎందుకంటే విజయపు అంచుల నుంచి ఓటమి వైపు వెళ్లినా... ఒక శాతం కూడా విజయావకాశం లేని చోట అనూహ్యంగా ఎగసి విజేతగా నిలవడం పాకిస్తాన్‌కే చెల్లు. 1992 టోర్నీ సహా ఇది గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా వరల్డ్‌ కప్‌లో ఆ జట్టు మరోసారి అలాంటి సంచలనాన్నే ఆశిస్తోంది. కాబట్టి ప్రతీ జట్టు జాగ్రత్త పడాల్సిందే. 1992 తరహా ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తామే గెలుస్తామని భావిస్తున్న అభిమానుల కోరిక నెరవేరుతుందా! తీవ్ర పోటీ ఉన్న ప్రపంచ కప్‌ పోరులో పాక్‌ నిలిచేదెక్కడ?

బలాలు
గతంలో ఎప్పుడు పాకిస్తాన్‌ గురించి ప్రస్తావించినా ఆ జట్టు బౌలింగ్‌ బలంపైనే ఎక్కువగా చర్చ జరిగేది. అయితే ఇటీవల  టీమ్‌ బ్యాటింగ్‌ కూడా ఎంతో మెరుగుపడింది. ముఖ్యంగా టాప్‌–3పైనే టీమ్‌ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఏకైక పాకిస్తాన్‌ ఆటగాడైన ఫఖర్‌ జమాన్, సుమారు 60 సగటుతో నిలకడగా రాణిస్తున్న ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ ఓపెనర్లుగా జట్టుకు కీలకం కానున్నారు. మూడో స్థానంలో ఇప్పటికే ‘పాక్‌ కోహ్లి’గా ప్రశంసలు అందుకుంటున్న బాబర్‌ ఆజమ్‌ రికార్డు అద్భుతంగా ఉంది. మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులైన హఫీజ్, షోయబ్‌ మాలిక్‌ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను నడిపించగలరు.

హారీస్‌ సొహైల్‌ మరో కీలక ఆటగాడు కాగా ఆసిఫ్‌ అలీకి మంచి హిట్టింగ్‌ సామర్థ్యం ఉంది. బౌలింగ్‌లో ‘చాంపియన్స్‌ ట్రోఫీ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ హసన్‌ అలీతో పాటు మొహమ్మద్‌ ఆమిర్‌ను జట్టు నమ్ముకుంది. లెగ్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌పై పాక్‌ ఆశలు పెట్టుకోగా... కుర్ర పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, హస్నయిన్‌ సంచలనాలు చేయగలరని జట్టు ఆశిస్తోంది. మ్యాచ్‌లు ఓడినా ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుస వన్డేల్లో 358, 340 పరుగులు చేయడం జట్టు బ్యాటింగ్‌ బృందంలో ఆత్మవిశ్వాసం పెంచింది.

బలహీనతలు
పాక్‌కు కవచకుండలాల్లాంటి బలహీనతలు నిలకడలేమి, ఘోరమైన ఫీల్డింగ్, ఒత్తిడిలో అనూహ్యంగా కుప్పకూలిపోయే లక్షణం ఒక్కసారిగా జట్టును బలహీనంగా మారుస్తున్నాయి. ఈతరం వన్డే క్రికెట్‌లో సాధారణంగా మారిపోయిన ‘పవర్‌ హిట్టింగ్‌’ పాక్‌ టీమ్‌లో అస్సలు కనిపించడం లేదు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచే తీసుకుంటే ఈ ప్రపంచ కప్‌లో పోటీ పడుతున్న జట్లలో (బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ మినహా) బౌండరీల రూపంలో అతి తక్కు వ పరుగులు (8.33 శాతం) చేసిన జట్టు పాకిస్తాన్‌. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ వైఫల్యం తరచూ జట్టును దెబ్బ తీస్తోంది. రెండు దశాబ్దాల కెరీర్‌ ఉన్న షోయబ్‌ మాలిక్‌ కూడా ఇటీవల కీలక సమయాల్లో చాలా సార్లు చేతులెత్తేశాడు.

ఈసారి అనూహ్యంగా పేస్‌ బౌలర్ల ఎంపిక వివాదాస్పదంగా మారి జట్టును గందరగోళంలో పడేసింది. జునైద్‌ ఖాన్‌ను తీసేసి రెండేళ్ల క్రితం చివరి వన్డే ఆడిన, ఇంగ్లండ్‌లో ఘోరమైన రికార్డు ఉన్న వహాబ్‌ రియాజ్‌ను ఎంపిక చేయడం, సుదీర్ఘ కాలంగా విఫలమవుతున్నా ఆమిర్‌పైనే నమ్మకముంచడం తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆఫ్రిది, హస్నయిన్‌ మెరుగ్గానే కనిపిస్తున్నా... వరల్డ్‌ కప్‌లాంటి మెగా టోర్నీలో వారి అనుభవలేమి సమస్యగా మారవచ్చు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి పాక్‌ బౌలింగ్‌ బలహీనంగానే కనిపిస్తోంది. పైగా హసన్‌ అలీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. దాదాపు 350 పరుగుల స్కోరు కూడా నిలబెట్టుకోకపోతుండటం దీనిని మరోసారి రుజువు చేసింది.  

గత రికార్డు...
ప్రతిష్టాత్మక కప్‌ను గెలుచుకున్న జట్లలో పాకిస్తాన్‌ కూడా ఒకటి. 1992లో ఇమ్రాన్‌ సారథ్యంలో పాక్‌ విశ్వవిజేతగా నిలిచింది. 1999లో ఫైనల్‌ కూడా చేరింది. మరో నాలుగు సందర్భాల్లో (1979, 1983, 1987, 2011)లలో సెమీఫైనల్‌ చేరిన రికార్డు ఉంది. గత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో క్వార్టర్‌ ఫైనల్లో ఓడి వెనుదిరిగింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

16-06-2019
Jun 16, 2019, 11:01 IST
ఇరు జట్లు తనకిష్టమే అన్నట్లుగా వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ ప్రత్యేకమైన డ్రెస్‌తో
16-06-2019
Jun 16, 2019, 10:32 IST
‘కీలక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ మానేసి షోయబ్‌ మాలిక్‌ షికార్లు’ అని టీవీలో వార్త ప్రసారం..
16-06-2019
Jun 16, 2019, 09:33 IST
 భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా..!  సగటు అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది.
16-06-2019
Jun 16, 2019, 09:18 IST
23 ఏళ్ల వ్యవధిలో తేదీలు, వేదికలు మారాయి... నాలుగు ఖండాల్లో ఆట జరిగింది... కానీ ఫలితం మాత్రం సేమ్‌ టు...
16-06-2019
Jun 16, 2019, 08:54 IST
బాగా ఆడినా, ఆడకపోయినా ఇదేమీ జీవితకాలం సాగదు..
16-06-2019
Jun 16, 2019, 06:03 IST
కార్డిఫ్‌: ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు బోణీ కొట్టింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు...
16-06-2019
Jun 16, 2019, 05:46 IST
బ్యాటింగ్, బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు శ్రీలంకపై ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. తొలుత కెప్టెన్‌ ఫించ్‌ భారీ సెంచరీతో అదరగొట్టడంతో...
16-06-2019
Jun 16, 2019, 05:22 IST
సరిగ్గా నాలుగు నెలల క్రితం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలభై మంది భారత సీఆర్‌పీఎఫ్‌...
15-06-2019
Jun 15, 2019, 22:43 IST
లండన్‌ : వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను...
15-06-2019
Jun 15, 2019, 20:19 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. లంకేయులు 15...
15-06-2019
Jun 15, 2019, 19:41 IST
మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో శిఖర్‌ ధావన్‌కు గాయం కావడంతో ‘స్టాండ్‌ బై’ ఆటగాడిగా ఇంగ్లండ్‌ చేరుకున్న భారత యువ వికెట్‌ కీపర్‌...
15-06-2019
Jun 15, 2019, 18:45 IST
లండన్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. అరోన్‌ ఫించ్‌(153; 132 బంతుల్లో 15 ఫోర్లు,...
15-06-2019
Jun 15, 2019, 18:08 IST
లండన్‌: ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు...
15-06-2019
Jun 15, 2019, 18:05 IST
మాంచెస్టర్‌: వన్డే ప్రపం​చకప్‌లో భాగంగా రేపు భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల్లో వేడి మొదలైంది. ఈ...
15-06-2019
Jun 15, 2019, 17:25 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ శతకంతో మెరిశాడు. ఆదిలో తన...
15-06-2019
Jun 15, 2019, 16:38 IST
మాంచెస్టర్‌: తన భార్య కంటే టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనియే ఎక్కువ ఇష్టమని పాకిస్తాన్‌ అభిమాని మహ్మద్‌ బషీర్‌...
15-06-2019
Jun 15, 2019, 15:58 IST
సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు....
15-06-2019
Jun 15, 2019, 15:31 IST
సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గాయాల బెడద వేధిస్తోంది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో...
15-06-2019
Jun 15, 2019, 14:43 IST
ముంబై: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు అప్పట్లో బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే అంటే చాలా ఇష్టం. ఈ...
15-06-2019
Jun 15, 2019, 14:38 IST
లండన్‌: వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో పోరుకు సిద్ధమైంది. శనివారం కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా శ్రీలంకతో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top