విండీస్ది అదే కథ.. అదే వ్యథ | pakistan beats west indies by 111 runs in first one day | Sakshi
Sakshi News home page

విండీస్ది అదే కథ.. అదే వ్యథ

Oct 1 2016 1:30 PM | Updated on Sep 4 2017 3:48 PM

విండీస్ది అదే కథ.. అదే వ్యథ

విండీస్ది అదే కథ.. అదే వ్యథ

వెస్టిండీస్ తీరు మారలేదు. పాకిస్తాన్తో జరిగిన ట్వంటీ 20 సిరీస్లో వైట్ వాష్ అయిన విండీస్.. వన్డే సిరీస్ ను కూడా ఘోర ఓటమితోనే ఆరంభించింది.

షార్జా: వెస్టిండీస్ తీరు మారలేదు. పాకిస్తాన్తో జరిగిన ట్వంటీ 20 సిరీస్లో వైట్ వాష్ అయిన విండీస్.. వన్డే సిరీస్ ను కూడా ఘోర ఓటమితోనే ఆరంభించింది. పాకిస్తాన్ తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో విండీస్ 111 పరుగుల తేడాతో భారీ ఓటమి చవి చూసింది. పాక్ విసిరిన 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 38.4 ఓవర్లలో 175 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో పాక్ 1-0 ఆధిక్యం సాధించింది.


విండీస్ ఆటగాళ్లలో మార్లోన్ శ్యామ్యూల్స్(43), సునీల్ నరైన్(23), చార్లెస్(20)మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు.  పాక్ స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. నవాజ్ 10.0 ఓవర్లలో 42 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా పేసర్ హసన్ అలీ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. పాక్ ఆటగాడు బాబర్ అజమ్(120) శతకంతో రాణించగా, ఓపెనర్ షర్జిల్ ఖాన్(54) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ను 49.0 ఓవర్లకు కుదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement