నేను ‘గే’... ఇదే నిజం | Olympic gold medalist swimmer Ian Thorpe reveals he is gay | Sakshi
Sakshi News home page

నేను ‘గే’... ఇదే నిజం

Jul 14 2014 8:13 AM | Updated on Sep 2 2017 10:15 AM

నేను ‘గే’... ఇదే నిజం

నేను ‘గే’... ఇదే నిజం

ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ తానో స్వలింగ సంపర్కుడినని స్పష్టం చేశాడు. ఐదు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతను తన లైంగికత్వంపై ఇన్నాళ్లు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ‘బ్రిటిష్ టాక్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

దిగ్గజ స్విమ్మర్ థోర్ప్ స్పష్టీకరణ
 సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ తానో స్వలింగ సంపర్కుడినని స్పష్టం చేశాడు. ఐదు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతను తన లైంగికత్వంపై ఇన్నాళ్లు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ‘బ్రిటిష్ టాక్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం ఆస్ట్రేలియా చానెల్లో ప్రసారమైంది. చాన్నాళ్లుగా ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అనే విమర్శల్ని తోసిపుచ్చిన థోర్ప్ తన హోదాకు తగినట్లు నడుచుకునేందుకే అలా చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.
 
 ‘నా కుటుంబం, నా దేశం  గర్వపడాలనుకున్నాను. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చాంపియన్ ‘గే’ అనే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదనుకున్నాను. అందుకే ఎప్పటికప్పుడు ఆ విమర్శల్ని ఖండిస్తూ వచ్చాను’ అని థోర్ప్ అన్నాడు.  31 ఏళ్ల థోర్ప్   ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచాడు. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లలో థోర్ప్ 11 స్వర్ణాలు సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement