breaking news
british talk show
-
‘విషాదానికి చింతిస్తూ..షో నిలిపివేస్తున్నాం’
లండన్ : పాపులర్ బ్రిటీష్ టాక్ షో ‘ది జెరెమీ కైలే షో’ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐటీవీలో ప్రసారమయ్యే జెరెమీ షోలో ప్రతీ ఎపిసోడ్‌కు ఇద్దరు పార్టిసిపెంట్లను ఆహ్వానిస్తారు. జీవిత భాగస్వాములు, ప్రేమికులే నిర్వాహకుల ప్రధాన టార్గెట్. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎదుటి వారిపై తమకున్న అభిప్రాయాలు, తమ బంధం గురించి చెప్పాల్సిందిగా కోరతారు. ఈ క్రమంలో స్టీవ్ డైమండ్(63) అనే వ్యక్తి తన ఫియాన్సితో కలిసి జెరెమీ షోకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా నిర్వహించిన లై డిటెక్టర్ పరీక్షలో అతడు విఫలమయ్యాడు. దీంతో స్టీవ్ తనను మోసం చేశాడని భావించిన ఫియాన్సీ అతడితో తెగదెంపులు చేసుకుంది. ఆమె దూరమవ్వడంతో ఈ కలత చెందిన స్టీవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే సహా వివిధ వర్గాల నుంచి ఈ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందించిన ఐటీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..‘ ఇటీవల చోటుచేసుకున్న విషాదాన్ని దృష్టిలో పెట్టుకుని జెరెమీ షోను నిలిపివేస్తున్నాం. 14 ఏళ్లుగా మిమ్మల్ని అలరించిన షో ఇకపై ప్రసారం కాబోదు. స్టీవ్ డైమండ్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాభ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో టీవీ షోల కారణంగా బ్రిటన్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాపులర్ షో లవ్ ఐలాండ్‌లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై స్పందించిన ప్రధాని అధికార ప్రతినిధి వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నేను ‘గే’... ఇదే నిజం
దిగ్గజ స్విమ్మర్ థోర్ప్ స్పష్టీకరణ సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ తానో స్వలింగ సంపర్కుడినని స్పష్టం చేశాడు. ఐదు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతను తన లైంగికత్వంపై ఇన్నాళ్లు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ‘బ్రిటిష్ టాక్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం ఆస్ట్రేలియా చానెల్లో ప్రసారమైంది. చాన్నాళ్లుగా ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అనే విమర్శల్ని తోసిపుచ్చిన థోర్ప్ తన హోదాకు తగినట్లు నడుచుకునేందుకే అలా చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. ‘నా కుటుంబం, నా దేశం గర్వపడాలనుకున్నాను. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చాంపియన్ ‘గే’ అనే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదనుకున్నాను. అందుకే ఎప్పటికప్పుడు ఆ విమర్శల్ని ఖండిస్తూ వచ్చాను’ అని థోర్ప్ అన్నాడు. 31 ఏళ్ల థోర్ప్ ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచాడు. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లలో థోర్ప్ 11 స్వర్ణాలు సాధించాడు.